పాపికొండల విహార యాత్ర ప్రారంభం
ELR: ఉభయగోదావరి జిల్లాలోని విహారయాత్రలకు పాపికొండల టూర్ ప్రారంభమైందని శాఖ డివిజనల్ మేనేజర్ పవన్ కుమార్ సోమవారం తెలిపారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఈ యాత్ర అదే రోజు సాయంత్రం 7 గంటలకు ముగుస్తుందన్నారు. పెద్దలకు టికెట్ ధర రూ.1,250, పిల్లలకు రూ.1,050 ఉందన్నారు. రాజమండ్రి ఇన్ఫర్మేషన్ రిజర్వేషన్ ఆఫీస్(IRO)లో టికెట్లు ముందుగా బుక్ చేసుకోవాలన్నారు.