రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

MDK: చేగుంట మండలం కర్నాల్ పల్లి శివారులో గజ్వేల్ రోడ్డుపై లారీ ఢీకొనడంతో బైక్ పై వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. బుధవారం దౌలతాబాద్ మండలం సురంపల్లి గ్రామానికి చెందిన తోడంగి లింగం(50) చేగుంట వైపు నుంచి గజ్వేల్ వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో వెనక నుంచి వచ్చి లారీ ఢీకొనడంతో బైక్ అదుపుతప్పి బోల్తా పడింది.