రాష్ట్ర స్థాయి పోటీలకు చెల్పూర్ విద్యార్థి ఎంపిక
KNR: హుజూరాబాద్ పరిధి చెల్పూర్‌కు చెందిన ZPHS విద్యార్థి జీ. చరణ్ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికయ్యాడు. ఈనెల 8వ తేదీ నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఏడుళ్లబయ్యారం గ్రామంలో జరగనున్న 69వ రాష్ట్ర స్థాయి పాఠశాలల బాయ్స్ కబడ్డీ విభాగంలో ఆయన పాల్గొననున్నాడు. జిల్లా స్థాయిలో అత్యుత్తమ ప్రతిభకనబరిచి ఎంపికైన చరణ్‌ను ప్రధానోపాధ్యాయులు అభినందించారు.