సివిల్ జడ్జిగా ప్రముఖ న్యాయవాది కూతురు
PLD: చిలకలూరిపేటకు చెందిన సాతులూరి యమున సివిల్ జడ్జిగా ఎంపికయ్యారు. ప్రముఖ న్యాయవాది భాగ్యరావు కుమార్తె అయిన ఆమె తండ్రి వద్దే జూనియర్‌గా ప్రాక్టీస్ చేశారు. తొలి ప్రయత్నంలో అవకాశం చేజారినా పట్టుదలతో చదివి రెండోసారి జడ్జిగా ఎంపికయ్యారు. తండ్రి కలను నెరవేర్చి యువతకు స్ఫూర్తిగా నిలిచిన యమునను పలువురు ప్రముఖులు అభినందించారు.