డెలివరీ బాయ్ అనుభవాన్ని అసెంబ్లీలో పంచుకున్న ఎమ్మెల్యే

డెలివరీ బాయ్  అనుభవాన్ని అసెంబ్లీలో పంచుకున్న ఎమ్మెల్యే

కృష్ణా: డెలివరీ బాయ్‌గా తన అనుభవాలను అసెంబ్లీలో పెనమలూరు MLA బోడె ప్రసాద్ బుధవారం పంచుకున్నారు. ఇతర దేశాల్లో డెలివరీ బాయ్ ఉద్యోగాన్ని చిన్నతనంగా చూడకుండా అందరూ చేస్తారని అదే స్ఫూర్తిని ఇక్కడ యువతలో నింపాలని తాను డెలివరీ బాయ్‌గా చేసినట్లు తెలిపారు. డెలివరీ బాయ్స్‌కి కంపెనీల వద్ద టాయిలెట్స్, నుంచోడానికి నీడ వంటి సమస్యలను సంబంధిత మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.