మంత్రి పార్థసారథి జోక్యం.. అయ్యప్పలకు స్పెషల్ విమానం

మంత్రి పార్థసారథి జోక్యం.. అయ్యప్పలకు స్పెషల్ విమానం

AP: హైదరాబాద్ నుంచి కొచ్చి వెళ్లాల్సిన విమానం ఆలస్యం కావడంతో హైదరాబాద్ విమానాశ్రయంలో అయ్యప్పలు ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో విజయవాడ వచ్చేందుకు అక్కడే ఉన్న మంత్రి పార్థసారథి ఇండిగో అధికారులతో మాట్లాడి విమానం ఆలస్యంపై కారణాలు తెలుసుకున్నారు. అనంతరం కేంద్రమంత్రి రామ్మోహన్‌తో స్వయంగా మాట్లాడి శబరిమలకు విమానం ఏర్పాటు చేయించారు.