24 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు

నెల్లూరు: జిల్లాలో 10వ తరగతి, ఇంటర్ సప్లమెంటరీ పరీక్షలకు పక్కాగా ఏర్పాట్లు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి లవన్న అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆయన అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈనెల 24 నుంచి జూన్ 3వ తేదీ వరకు పదోతరగతి, ఈనెల 24 నుంచి జూన్ 1 వరకు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయని వెల్లడించారు.