జీవన్ రెడ్డి ఇంటిపై ఇందిరా గాంధీ ప్లెక్సీలు తొలగింపు
జగిత్యాలలో మాజీ మంత్రి జీవన్ రెడ్డితో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ భేటీ అయిన విషయం తెలిసిందే. అయితే ఎంత బుజ్జగించిన మాజీ మంత్రి వెనక్కి తగ్గడం లేదు. మహేష్ కుమార్ గౌడ్ వెళ్లిన కాసేపటికే తన ఇంటిపై ఇందిరా భవన్ పేరుతో ఉన్న ప్లెక్సీలను తొలగించారు. రేపు కాంగ్రెస్ పార్టీకి జీవన్ రెడ్డి రాజీనామా చేయనున్నారు.