ఆసియాలోనే అతిపెద్ద మట్టిడ్యామ్.. కండలేరు

NLR: తెలుగుగంగ ప్రాజెక్టులో అంతర్భాగమైన ఈ జలాశయం మట్టికట్టతో నిర్మితమైనది. దీని పొడవు పదకొండు కిలోమీటర్లు. ఇది ఆసియాలోనే అతిపెద్ద మట్టిడ్యామ్ గుర్తింపు పొందింది. ఇది నెల్లూరు నుంచి 45 కిలోమీటర్ల దూరంలో కలదు. సోమశిల జలాశయం నుంచి నీరు 45 కిలోమీటర్లు ప్రయాణించి కండలేరు చేరుతుంది. ఈ డ్యామ్ పై భాగంలోని గెస్ట్ హౌస్ ఎంతో అందంగా కట్టబడి పర్యాటకులను ఆకర్షిస్తుంది.