VIDEO: పాతబస్తీలో కూలిన పురాతన భవనం

VIDEO: పాతబస్తీలో కూలిన పురాతన భవనం

HYD: గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పాతబస్తీ హుస్సేన్ ఆలయం పరిధిలోని చోటిసరా ప్రాంతంలో 114 ఏళ్ల పురాతన భవనం కూలి ఓ బైక్ ధ్వంసమైంది. కాగా.. సోమవారం భవనం పైభాగం కూలిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. వెంటనే GHMC సిబ్బంది రంగంలోకి దిగి ఘటనకు సంబంధించిన వివరాలపై ఆరా తీస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.