'సంక్షేమ పథకాలే ప్రజలకు శ్రీరామరక్ష'
BDK: కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలే తెలంగాణ ప్రజలకు శ్రీరామరక్ష అని రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్, డీసీఎంఎస్ మాజీ ఛైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం కొత్వాల పాల్వంచ మండలం పరిధిలోని పలు పంచాయతీల్లోని నాగారం కాలనీ, దంతలబోరా ఎస్సీ కాలనీ, నాగారం, తోగ్గుడెంలో పర్యటించారు.