మద్యం కేసు.. అవినాశ్‌రెడ్డిని విచారించిన సిట్
AP: వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో నిందితుడు ముప్పిడి అవినాశ్ రెడ్డి(ఏ7) తొలి రోజు విచారణ ముగిసింది. దాదాపు 7 గంటలపాటు సిట్ అధికారులు అతడిని ప్రశ్నించారు. వైద్య పరీక్షల తర్వాత గుంటూరు జైలుకు తరలించారు. మంగళ, బుధవారం కూడా అవినాష్‌ను సిట్ అధికారులు విచారించనున్నారు.