'మద్యం సేవించి వాహనాలు నడిపితే కేసులు'

KMM: త్రిబుల్ రైడింగ్, మైనర్ డ్రైవింగ్, మద్యం సేవించి వాహనాలు నడిపితే కేసులు నమోదు చేస్తామని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు. ఛార్జ్ షీట్లను సకాలంలో దాఖలు చేయడం అలవర్చుకోవచ్చని పోలీసు అధికారులకు సూచించారు. మహిళలపై, చిన్నారులపై జరిగే నేరాలు, మాదకద్రవ్యాల రవాణాను ఏమాత్రం సహించబోమని స్పష్టం చేశారు. నేరస్తులకు శిక్షలు పడేలా చూడాలన్నారు.