అంబేడ్కర్ జయంతికి పరిటాల సునీతకు ఆహ్వానం
ATP: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 135వ జయంతి సందర్భంగా అనంతపురం రూరల్ మండలం సోమలదొడ్డిలో నిర్వహించే వేడుకలకు MLA పరిటాల సునీతను ఆహ్వానించారు. ఎమ్మార్పీఎస్ నేత సుదర్శన్, ఇతర నాయకులు ఆమెను కలిసి ఈ మేరకు విన్నవించారు. బడుగు, బలహీన వర్గాల నాయకులు, కుల సంఘాల ప్రతినిధులు తరలివచ్చి ఈ మహోత్సవాన్ని జయప్రదం చేయాలని కోరారు.