కర్రల డిపార్ట్ మిషన్‌లో పడి మహిళ మృతి

VZM: గంట్యాడ మండలంలోని సిరిపురం గ్రామంలో శనివారం మధ్యాహ్నం నీలగిరి కర్రల డిపార్ట్ మిషన్ వద్ద పనిచేస్తున్న మహిళా కూలీ లక్కీడాం గ్రామానికి చెందిన అస్కపల్లి జ్యోతి ప్రమాదవశాత్తు మిషన్‌లో పడి అక్కడికక్కడే దుర్మరణం చెందింది. మిషన్ వద్ద పనిచేస్తున్న జ్యోతి చీర మిషన్‌లోకి వెళ్లడంతో మిషన్ ఆమెను లాగేసి ఆమె జుట్టు కర్రల మిషన్‌లోకి వెళ్లి మృతి చెందింది.