'క్రిప్టో కరెన్సీ మోసాలపై అప్రమత్తంగా ఉండండి'

'క్రిప్టో కరెన్సీ మోసాలపై అప్రమత్తంగా ఉండండి'

VSP: నగరంలో పెరుగుతున్న క్రిప్టో మోసాలపై ప్రజలు జాగ్రత్తగా ఉండాలని విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చీ సూచించారు. నకిలీ యాప్‌లు, వాట్సాప్ లింకులతో మొబైల్ హ్యాక్ అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అధిక లాభాల ఆశ చూపే ఇన్వెస్ట్‌మెంట్ టిప్స్‌ను నమ్మవద్దని, స్పెల్లింగ్ తప్పులున్న వెబ్‌సైట్లు నకిలీవని గుర్తించాలని తెలిపారు. మోసపోతే వెంటనే 1930కు ఫిర్యాదు చేయాలని సూచించారు.