ఆర్టీసీ సిబ్బందికి శిక్షణా కార్యక్రమం

ఆర్టీసీ సిబ్బందికి శిక్షణా కార్యక్రమం

కృష్ణా: డ్రైవర్లు విధి నిర్వహణలో ప్రశాంతంగా ప్రయాణికులతో మెలగాలని జిల్లా ప్రజా రవాణా అధికారి వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం మచిలీపట్నంలో RTC సిబ్బందికి శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. కృష్ణాజిల్లా పరిధిలోని అన్ని డిపోల నుంచి బస్సు ప్రమాదాలు జరిపిన డ్రైవర్లు, ఫిర్యాదులు వచ్చిన డ్రైవర్లు, మద్యం సేవించి విధులకు హాజరైన డ్రైవర్లు, కండక్టర్లకు శిక్షణ ఇచ్చారు.