కేంద్ర కారాగారంలో మామిడి తోట బహిరంగ వేలం
విశాఖ కేంద్ర కారాగారం ఆవరణలోని మామిడి తోట పంటకు ఏప్రిల్ 8న బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు కారాగార అధికారులు తెలిపారు. ఉదయం 10 గంటలకు కారాగార పరేడ్ గ్రౌండ్‌లో వేలం జరుగుతుందన్నారు. ఆసక్తి గలవారు రూ.1,000 డిపాజిట్ ముందుగా చెల్లించాలి వేలంలో పాల్గొనాలన్నారు. గెలిచిన వారు వెంటనే మొత్తం చెల్లించాల్సి ఉంటుందని అన్నారు.