అల్పపీడనం.. రాష్ట్రంలో అతి భారీ వర్ష సూచన

అల్పపీడనం.. రాష్ట్రంలో అతి భారీ వర్ష సూచన

TG: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. భూపాలపల్లి, ఆదిలాబాద్, హనుమకొండ, వరంగల్, కామారెడ్డి, ఖమ్మం, కొమరంభీమ్, నిర్మల్, మంచిర్యాల, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, సూర్యాపేట జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. గంటకు 30-40 కి.మీల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశమున్నట్లు తెలిపింది.