విషాదం.. పెళ్లి కూతురు, తల్లి ఆత్మహత్య

విషాదం.. పెళ్లి కూతురు, తల్లి ఆత్మహత్య

BPT: తల్లి, కూతురు ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన ఘటన ద్రోణాదులలో జరిగింది. ఎంగేజ్‌మెంట్ అనంతరం వరుడు పెళ్లికి నిరాకరించడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నారు. చికిత్స నిమిత్తం గుంటూరు ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతులు సుజాత (46), దివ్య(25)గా గుర్తించారు. పెళ్లి కూతురు తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.