మ్యూల్ ఖాతా ముసుగులో సైబర్ నేరాలు
HYD: జూబ్లీహిల్స్ మర్కంటైల్ కో-ఆపరేటివ్ బ్యాంకులో వెలుగుచూసిన మ్యూల్ ఖాతాల కేసులో సైబర్ క్రైం పోలీసుల దర్యాప్తులో లింకు బహిర్గతమైంది. గత నెల 25న సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలోని బృందాలు ఆపరేషన్ క్రాక్ డౌన్ పేరిట ఒకేసారి 16 జిల్లాల్లోని పలు బ్యాంకుల్లో తనిఖీలు నిర్వహించాయి. మ్యూల్ ఖాతాలతో రాష్ట్రంలో 782, దేశ వ్యాప్తంగా 9431 సైబర్ నేరాల లావాదేవీలతో ప్రయేయం ఉన్నట్లు తేలింది.