VIDEO: చీర మీద రామాయణం.. ఎంత అద్భుతంగా ఉందో!
కోనసీమ: చీరపై గోరింటాకు ఉపయోగించి రామాయణంలోని ముఖ్య ఘట్టాలను చిత్రీకరించారు. శ్రీ రామనవమి సందర్భంగా గురువారం ఇద్దరు బాలికలు దీనిని రూపొందించారు. మండపేటలోని శ్రీ సత్య డ్రాయింగ్ అకాడమీకు చెందిన విద్యార్థినిలు వంకల శివలీల, రామిశెట్టి మౌనిక చీరపై ఎలాంటి కెమికల్స్ లేకుండా గోరింటాకుతో రామాయణ కావ్య దివ్య దృశ్యాలు రూపొందించారు.