VIDEO: తల్లంపాడులో దంచికొట్టిన వర్షం
KMM: ఖమ్మం రూరల్ మండలం తల్లంపాడులో గురువారం వర్షం దంచికొట్టింది. ఉదయం నుంచి దట్టమైన మేఘాలు అలుముకోవడంతో ఒక్కసారి అతి భారీ వర్షం కురిసింది. వర్షానికి జనజీవనం కాసేపు పూర్తిగా స్తంభించిపోయింది. అయితే భారీ వర్షం పట్ల పత్తి, మిరప తోటలకు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉంటుందని రైతులు వాపోయారు. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.