మున్సిపల్ బాత్రూమ్ నిర్మాణంపై అభ్యంతరం
అన్నమయ్య: మదనపల్లె చలపతిరావు కాలనీలో టీటీడీ కళ్యాణ మండపం పక్కన ఉన్న గంగమ్మ గుడికి ఆనుకుని మున్సిపల్ బాత్రూమ్‌లు నిర్మించడంపై సోమవారం కాలనీ వాసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. గుడి సమీపంలో బాత్రూమ్‌లు నిర్మిస్తే దుర్వాసన, అస్వచ్ఛతతో పాటు ఆధ్యాత్మిక ప్రదేశం పవిత్రత దెబ్బతింటుందని పేర్కొంటూ.. నిర్మాణ పనులను వెంటనే నిలిపివేయాలని జిల్లా కలెక్టర్‌ను కోరారు.