రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
SRPT: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందిన సంఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట మండల శివారులోని ఉర్లుగొండ వద్ద జాతీయ రహదారి 65 పై టూ వీలర్ వాహనదారుడు టర్న్ తీసుకుంటుండగా, వెనకనుంచి వేగంగా వచ్చిన కారు ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.