వైసీపీ నేత డాబాను కూల్చేసిన అధికారులు

KDP: దువ్వూరు మండలం ఇడమడక వద్ద గల జాతీయ రహదారి పక్కన ఉండే వైసీపీ నేత శ్రీకాంత్‌కు చెందిన డాబాను సోమవారం ఉదయం రెవెన్యూ, పోలీసు అధికారులు కూల్చివేశారు. నిబంధనల మేరకు రహదారి స్థలంలో ఉండటంతో కూల్చి వేశామని అధికారులు వివరణ ఇచ్చారు. టీడీపీ కక్ష సాధింపులో భాగంగా అధికారులు తన డాబాను ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తెల్లవారుజామున 5 గంటలకే కూల్చివేశారని అన్నారు.