రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
NLG: చిట్యాల మండలం గుండ్రంపల్లి శివరులో జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో హోంగార్డు సుర్వీ వెంకటేష్ (45) అక్కడికక్కడే మృతి చెందారు. గుర్తు తెలియని వాహనం బైక్‌ను ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మృతుడు సంస్థాన్ నారాయణపురం పీఎస్‌లో విధులు నిర్వహిస్తున్నట్లు స్థానికులు గుర్తించారు. ఈ ఘటనతో వెంకటేష్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.