పురుగుల మందు కలిపిన నీళ్లు తాగి జీవాలు మృత్యువాత
MHBD: నెల్లికుదురు మండలంలోని మేచరాజుపల్లి గ్రామానికి చెందిన నక్క యాకయ్య అదే గ్రామానికి చెందిన ఓ రైతు సాగు చేసిన 8 ఎకరాల ఆయిల్ ఫామ్ తోటలో జీవాలను మేపడానికి ఒప్పందం చేసుకున్నాడు. తోటలో పురుగుల మందు కలిపిన నీళ్లు తాగి గొర్రెలు, మేకలు మృతి చెందాయి. తోట యజమాని నుంచి నష్ట పరిహారం ఇప్పించాలని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు బాధితుడు తెలిపారు.