నేడు బాపట్లలో జాతీయ మెగా లోక్ అదాలత్

నేడు బాపట్లలో జాతీయ మెగా లోక్ అదాలత్

బాపట్ల జిల్లా కోర్టుల సముదాయం వద్ద శనివారం జాతీయ మెగా లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు బాపట్ల మండల న్యాయ సేవాధికారి కమిటీ ఛైర్మన్, జడ్జి శ్యాం బాబు తెలిపారు. ఈ లోక్ అదాలత్‌ ద్వారా పెండింగ్‌లో ఉన్న అన్ని రకాల కేసుల ఇరుపక్షాలతో రాజీ కుదిర్చి సామరస్య పూర్వకంగా కేసులను పరిష్కరిస్తామన్నారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.