సర్పంచులకు పరిపాలన, పల్లె అభివృద్ధి శిక్షణ
SRPT: కోదాడ పట్టణంలోని కె.ఆర్.ఆర్. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నాలుగు రోజులుగా సాగిన సర్పంచుల శిక్షణ కార్యక్రమం ముగిసింది. ముగింపు సమావేశంలో శిక్షణ అధికారులు సర్పంచులు గ్రామ పంచాయతీ నిధుల వినియోగం, పల్లె ప్రగతి పనులు, పరిపాలనపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. గ్రామ సమస్యల పరిష్కారంలో నిబంధనలకు అనుగుణంగా ఎలా వ్యవహరించాలో వివరించారు.