కోర్టుకు బాంబు బెదిరింపు

కోర్టుకు బాంబు బెదిరింపు

TG: వరంగల్ జిల్లా కోర్టుకు ఈ-మెయిల్ ద్వారా బాంబు బెదిరింపు రావడంతో కలకలం రేగింది. పోలీసులు అప్రమత్తమై, కోర్టు ప్రాంగణాన్ని పూర్తిగా ఖాళీ చేయించారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ రంగంలోకి దిగి అణువణువూ తనిఖీలు చేస్తున్నాయి. న్యాయవాదులు, సిబ్బంది భయాందోళనతో బయటకు పరుగులు తీయడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఆగంతకుడి ఈ-మెయిల్ మూలాలను గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.