రేపు వేదనారాయణ స్వామి ఆలయంలో పసుపు, కుంకుమ పంపిణీ

రేపు వేదనారాయణ స్వామి ఆలయంలో పసుపు, కుంకుమ పంపిణీ

TPT: నాగలాపురంలోని శ్రీ వేదవల్లి సమేత శ్రీ వేదనారాయణ స్వామి ఆలయంలో శుక్రవారం వరలక్ష్మి వ్రతం సందర్భంగా టీటీడీ ఆధ్వర్యంలో ముత్తయిదువులకు పసుపు కుంకుమ పంపిణీ చేయనున్నట్లు ఆలయ అధికారి చెంగల్ రాయలు తెలిపారు. శ్రావణ శుక్రవారం ఉదయం 9 గంటలకు ఆలయానికి విచ్చేసే మహిళా భక్తులకు పసుపు, కుంకుమ ఇవ్వనున్నట్లు తెలిపారు.