150 ఎకరాల్లో నేలరాలిన మామిడి పంట

MNCL: బెల్లంపల్లి డివిజన్‌లో గత 2రోజులుగా భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసి 150 ఎకరాల్లో మామిడి పంట నేలరాలింది. గురిజాల, అంకుశం, మాలగురిజాల, పెర్కపల్లి తదితర గ్రామాల్లో రైతులు తీవ్ర నష్టాన్ని చవిచూశారు. ఈ ఏడాది 250-350 ఎకరాల్లో పంట నష్టపోయినట్లు అధికారులు తెలిపారు. నష్టపరిహారం అందించి ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.