పవర్ లిఫ్టింగ్ పోటీలకు భానుప్రసాద్ ఎంపిక

VZM: దత్తిరాజేరు మండలం కోమటిపల్లి గ్రామానికి చెందిన దాసరి భానుప్రసాద్ అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ పోటీలకు ఎంపికయ్యారు. విశాఖలో ఇటీవల జరిగిన పోటీల్లో 200 కిలోల విభాగంలో భాను ప్రసాద్ ప్రథమ స్థానంలో నిలిచి ఏప్రిల్‌లో నేపాల్‌లో జరగనున్న అంతర్జాతీయ పోటీలకు అర్హత సాధించాడు. జనసేన నేత మామిడి దుర్గాప్రసాద్ అభినందించి 5000 రూపాయలు ఆర్థిక సహాయం అందించారు.