మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్‌కు నోటీసులు

మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్‌కు నోటీసులు

కృష్ణా: మాజీ పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్‌పై కూటమి ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యలు చేపడుతుందని వైసీపీ నేతలు మంగళవారం విమర్శించారు. ఇందులో భాగంగా పెడన వైసీపీ కార్యాలయానికి పోలీసులు వచ్చి, కైలే అనిల్ కుమార్‌కు నోటీసులు అందజేశారు. ఈ నోటీసుల ప్రకారం, రాబోయే శనివారం పమిడిముక్కల పోలీస్ స్టేషన్‌కు విచారణ నిమిత్తం హాజరుకావాలని పోలీసులు తెలిపారు.