ఈనెల 6, 7న అథ్లెటిక్స్ ఎంపికలు

ఈనెల 6, 7న అథ్లెటిక్స్ ఎంపికలు

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఎసీఎఫ్ ఆధ్వర్యంలో అండర్ - 14, 17 విభాగంలో అథ్లెటిక్స్ ఎంపికల పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కార్యదర్శి డాక్టర్ ఆర్.శారదాబాయి తెలిపారు. నగరంలోని డీఎస్ఏ స్టేడియంలో ఈనెల 6న అండర్ -14, 7వతేదిన అండర్ -17 బాల, బాలికలకు ఎంపికలు ఉంటాయన్నారు. ఆసక్తిగల క్రీడాకారులు ఒరిజినల్ బోనఫైడ్, ఆధార్ కార్డుతో ఉదయం 8 గంటలలోపు రిపోర్ట్ చేయాలని సూచించారు.