నేడు వ్యవసాయ, పరిశోధన విస్తరణపై సమావేశం
ASR: చింతపల్లిలో నేడు ఆచార్య ఎన్. జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలం పరిధిలో వ్యవసాయ, పరిశోధన విస్తరణ సలహా మండలి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ప్రదానంగా ఎల్ నీనో ప్రభావంపై చర్చించబోతున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. రాబోయొ కాలంలో వర్షాలు తక్కవ ఉన్న నేపద్యంలో అధిక దిగుబడులపై మొగ్గుచూపేల రైతులకు వివరిస్తామన్నారు.