తొర్రూరు నుంచి శబరిమలైకి ప్రత్యేక బస్సు

తొర్రూరు నుంచి శబరిమలైకి ప్రత్యేక బస్సు

అయ్యప్ప మాల ధరించిన స్వాములకు టీజీఎస్ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. ఈనెల 17న తొర్రూరు నుంచి శబరిమలైకి ప్రత్యేక బస్సు సౌకర్యం ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ వి. పద్మావతి తెలిపారు. ఈ బస్సు శ్రీశైలం, మహానంది, అహోబిలం, పళని, గురువాయూర్, అయ్యప్ప సన్నిధానం, త్రివేండ్రం, రామేశ్వరం, మధురై, శ్రీరంగం వంటి పుణ్యక్షేత్రాలను కలుపుతూ వెళ్తుందని బుధవారం ఆమె తెలిపారు.