సీఎంతో మాట్లాడి ఆ కుటుంబాన్ని ఆదుకుంటాం: ఎమ్మెల్యే

సీఎంతో మాట్లాడి ఆ కుటుంబాన్ని ఆదుకుంటాం: ఎమ్మెల్యే

VZM: ఇటీవల కాకినాడలో జరిగిన అగ్నీవీర్ ర్యాలీలో మృతి చెందిన సంతకవిటి మండలం శ్రీ హరినాయుడుపేట గ్రామానికి చెందిన గండ్రేటి సాయికిరణ్‌ కుటుంబాన్ని సోమవారం రాజాం ఎమ్మెల్యే కొండ్రు మురళి ఓదార్పారు. దేశానికి సేవ చేయాలనే సంకల్పంతో ప్రాణాలు విడిచిన సాయికిరణ్‌ గురించి సీఎంతో మాట్లాడి కుటుంబానికి ఆర్ధికంగా ఆదుకుంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.