పాక్‌కు ఖరీఫ్‌లో నీటికి కటకట!

పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో సింధూ నదీ జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేసింది. భారత్ తీసుకున్న నిర్ణయంతో చీనాబ్ నదిలో ప్రవాహం నిలిచిపోయింది. దీంతో ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో పాకిస్థాన్‌కు 21 శాతం నీటి లోటు ఏర్పడనుందని ఇండస్ రివర్ సిస్టమ్ అథారిటీ అంచనా వేసింది.