రైతు భరోసా దరఖాస్తుల ఆహ్వానం
NRPT: కోస్గి మండలం ముక్తిపాడ్ రైతు వేదికలో రైతు భరోసా దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఏవో వినోద్ కుమార్ తెలిపారు. రైతులు తమ పట్టా పాస్ బుక్, ఆధార్, బ్యాంక్ ఖాతా జిరాక్స్ కాపీలను అందజేయాలని సూచించారు. సందేహాలు ఉంటే వ్యవసాయ అధికారులను సంప్రదించాలన్నారు. ముశ్రీఫా క్లస్టర్ పరిధిలోని రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.