'సచివాలయ సిబ్బంది సమయపాలన పాటించాలి'

'సచివాలయ సిబ్బంది సమయపాలన పాటించాలి'

VZM: గ్రామ సచివాలయ సిబ్బంది విధిగా సమయపాలన పాటించాలని ఎంపీడీవో డి.డి.స్వరూపా రాణి సూచించారు. సోమవారం పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ సచివాలయ సిబ్బంది సమయపాలన పాటించడంతో పాటు రికార్డుల నిర్వహణ సక్రమంగా ఉండాలని సూచించారు. గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు.