రైతుల సంక్షేమమే నా ధ్యేయం: మంత్రి తుమ్మల
KMM: ఏ పార్టీలో ఉన్నా రైతుల సంక్షేమమే తన ధ్యేయమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. రైతులు పంటల వైవిధ్యంపై దృష్టి సారించి, అధిక డిమాండ్, లాభాలు వచ్చే పంటల వైపు మళ్లాలని సూచించారు. ఆయిల్‌పామ్‌ను ప్రోత్సహించాలని కేంద్రాన్ని కోరినట్లు, పామాయిల్ దిగుమతిపై పన్ను పెంచితే దేశీయ రైతులకు మేలు జరుగుతుందని తెలిపారు.