టీడీపీ సర్పంచ్ అభ్యర్థి ఘన విజయం..
KNR: గంగాధర మండలంలోని గట్టుబూత్కూర్ గ్రామ సర్పంచ్ పదవికి పోటీ చేసిన టీడీపీ అభ్యర్థి మల్కాపురం రాజేశ్వరి బలమైన పోటీదారులను ఓడిస్తూ సర్పంచ్‌గా విజయం సాధించింది. స్థానిక స్థాయిలో ప్రజలకు చేరువై పనిచేయడం, గ్రామ అభివృద్ధి అంశాలపై స్పష్టమైన హామీలు ఇవ్వడం, కుటుంబ సభ్యుల సానుకూల పాత్ర, గ్రామస్థుల విశ్వాసం కలిసి వచ్చి రాజేశ్వరి విజయం సాధించినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.