VIDEO: విద్యుత్ లైన్ తొలగించాలని బాధితులు ధర్నా
ప్రకాశం: మార్కాపురం జిల్లా విద్యుత్ శాఖ కార్యాలయం ముందు న్యాయం చేయాలని బాధితులు ధర్నా చేపట్టారు. పట్టణంలోని 17, 18 వార్డులలో విద్యుత్ మెయిన్ లైన్ ఉన్నందువల్ల సుమారు 6 మంది పిల్లలు విద్యుత్ ప్రమాదానికి గురయినట్లు వారు తెలిపారు. ఇటీవల ఒక బాలుడు విద్యుత్ ప్రమాదానికి గురై ప్రాణాపాయ పరిస్థితిలో గుంటూరులో చికిత్స పొందుతున్నారు. మెయిన్ లైన్ తొలగించాలని బాధితులు కోరారు.