బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు

బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు

యూపీ లక్నోలోని ఓ బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు వర్కర్లు మరణించగా.. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పేలుడు శబ్దాలు పలు కిలో మీటర్లకు వరకు వినిపించడంతో స్థానికులు భయాందోళన చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.