సవాల్ విసిరిన చీరాల మున్సిపల్ ఛైర్మన్

BPT: తనపై అవిశ్వాస తీర్మానం పెట్టిన కౌన్సిలర్లు చేసిన అవినీతి ఆరోపణల మీద ఎలాంటి విచారణకైనా సిద్ధమని చీరాల మున్సిపల్ ఛైర్మన్ శ్రీనివాసరావు సవాల్ విసిరారు. సీబీసీఐడీ లేదా విజిలెన్స్, ఏసీబీ వంటి ఏ విచారణ అయినా చేసుకోవచ్చని శుక్రవారం మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. తన హయాంలో దాదాపు రూ. 100 కోట్ల అభివృద్ధి పనులు అవినీతి లేకుండా జరిగాయని ధీమా వ్యక్తం చేశారు.