'కృష్ణానది పరివాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'
SRPT: కృష్ణానది పరివాహక ప్రాంతాల ప్రజలు వేసవిలో అప్రమత్తంగా ఉండాలని మఠంపల్లి ఎస్సై బాబు సూచించారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. ఎండల తీవ్రత దృష్ట్యా పశువులకు నీరు తాగించేందుకు నదిలోకి వెళ్లవద్దని హెచ్చరించారు. ఒంటిపూట బడుల నేపథ్యంలో పిల్లలు ఈత కోసం నది, బావుల వద్దకు వెళ్లకుండా తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని కోరారు.