ట్రాన్స్‌ఫార్మర్ ధ్వంసం… కాపర్ వైర్ల అపహరణ
NRML: కుబీర్ మండలంలో వ్యవసాయ ట్రాన్స్‌ఫార్మర్‌ను దుండగులు ధ్వంసం చేసి కాపర్ వైర్లను అపహరించారు. రాత్రి వేళ రోడ్డు పక్కన ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ను కిందకు పడదోసి విలువైన వైర్లు తీసుకెళ్లినట్లు స్థానికులు తెలిపారు. ఘటనపై విద్యుత్ శాఖ అధికారులు, పోలీసులకు సమాచారం అందించారు. పంట పొలాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.