చికెన్ షాపుల అసోసియేషన్‌తో కమిషనర్ సమావేశం

చికెన్ షాపుల అసోసియేషన్‌తో కమిషనర్ సమావేశం

గుంటూరు పరిధిలో మాంసం వ్యర్థాల అనధికార తరలింపుదారులపై చర్యలు తీసుకుంటామని కమిషనర్ పులి శ్రీనివాసులు ప్రకటించారు. నిర్దేశిత టెండర్ ద్వారా కాంట్రాక్ట్ పొందిన ఏజన్సీనే వ్యర్థాలను సేకరిస్తుందని స్పష్టం చేశారు. శుక్రవారం చికెన్ షాపుల అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.‌ వ్యర్థాలను అనధికార వ్యక్తులకు ఇవ్వడానికి వీలు లేదని తేల్చి చెప్పారు.